Karthika Deepam Heroine Premi viswanath Real life Husband and Family


Karthika Deepam Heroine Premi viswanath Real life Husband and Family


ప్రేమి విశ్వనాథ్ అంటే తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు. కాని కార్తీక దీపం సీరియల్ దీప అంటే మాత్రం తెలియని బుల్లితెర ప్రేక్షకులు లేరంటే అతిశయోక్తి కాదు.
నల్లటి రూపంతో బుల్లి తెర మీద ప్రముఖ నటి గా వెలుగొందుతున్న ప్రేమి విశ్వనాథ్ కు తెలుగు ప్రేక్షక అభిమానుల చాలామందే ఉన్నారు.

Karthika Deepam Heroine



ఒక సూపర్ హిట్ సినిమా రేంజ్ లో కార్తీకదీపం బుల్లితెరపై దూసుకుపోతోంది అంటే దానికి ప్రేమి విశ్వనాథ్ నటన కూడా ఓ ప్రధాన కారణం. వంటలక్కగా తెలుగు ప్రేక్షకుల చేత నీరాజనాలు అందుకుంటున్న ప్రేమి విశ్వనాథ్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం...
ప్రేమి విశ్వనాథ్ డిసెంబర్ 2, 1991 న కేరళలోని ఎర్నాకుళంలో, విశ్వనాథ్...  కాంచన దంపతులకు జన్మించింది. ప్రేమి విశ్వనాథ్ బాల్యం విద్యాభ్యాసమంతా కూడా
ఎర్నాకులంలోనే జరిగింది. ఆమె LAW పూర్తి చేసింది. ఆ తర్వాత  కొచ్చి లోని ఓ ప్రైవేట్ సంస్థలో లీగల్  అడ్వైసర్ గా పని చేసింది. ప్రేమి విశ్వనాథ్ అన్నయ్య శివప్రసాద్ మంచి ఫోటో గ్రాఫర్, అలాగే ఆర్టిస్టు కూడా ఆ విధంగా ప్రేమి విశ్వనాథ్ కు ఫోటోగ్రఫీ అబ్బింది. ప్రేమి పెళ్లిళ్లకు ఫోటోలు కుడా తీసేది . ఒకరకంగా చెప్పాలంటే ఫోటోగ్రఫీ అంటే ప్రేమి విశ్వనాథ్ కు పిచ్చి. ముఖ్యంగా ప్రకృతి సౌందర్యాన్ని కెమెరాలో బందించడం ఆమెకు  చాలా ఇష్టం. దీనికి తోడు ట్రావెల్ ఏజెన్సి కుడా నడుపుతున్నారు. ఆమె స్టూడియోలోనే కెమెరా ముందు మోడల్గా హొయలు పోయేది... అలా కెమెరా ముందుకు రావడం మొదలైంది.

Premi viswanath Real life Husband and Family


ఇక ప్రేమి విశ్వనాథ్ కరత్తముత్తు అనే మలయాళం సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైంది. అదే ఇప్పుడు తెలుగులో కార్తీక దీపం గా రీమేక్ అయింది.
తన స్టూడియోలో కెమెరా ముందు చేసిన మోడలింగ్ నటిగా కెమెరా ముందు నటించడానికి ఆమెకు బాగా ఉపయోగపడింది. కరత్తముత్తు సీరియల్ మలయాళ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.  బ్లాకు బ్యూటీ గా అందరి చేత అభినందనలు అందుకుంది అయితే  సీరియల్ లో నల్ల అమ్మాయిగా కనిపించే  దీపా రియల్ గా మాత్రం చాలా ఫెయిర్ గా ఉంటుంది.
కరత్తముత్తు సీరియల్ కు గాను  ASIA Net Telivision  అవార్డు కూడా అందుకుంది.
ఈ సీరియల్ కి  వచ్చిన గుర్తింపుతో ఏషియా నెట్ టెలివిజన్లో కొన్ని కార్యక్రమాలు కుడా చేసింది. అలాగే కుట్టికలవారా అనే  రియాలిటీ షోని ఫ్లవర్ ఛానల్ కోసం చేసింది.
అదే ఛానల్ లో మునుమని సీరియల్లో నటించింది. ఇలా వరుసగా సీరియల్స్,  షోస్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ప్రేమి.

అదే క్రమంలో సూర్య టివిలో ఒక సీరియల్ లో నటించింది. అదే ఛానల్లో డీల్ ఆర్ నో డీల్  పేరుతో గేమ్ షో చేసి మలయాళ బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యింది. 23 ఏళ్ళ వయసులోనే ఇద్దరు పిల్లల తల్లిగా సీరియల్ లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రేమి విశ్వనాథ్ 2017 లో కార్తీకదీపం సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.
కరతముత్తు సీరియల్ మలయాళంలో సంచలన విజయం సాధించడంతో అదే కథను తెలుగులో రీమేక్ చేసారు. ఇందులో నిరుపమ్ పరిటాల జంటగా ప్రేమి విశ్వనాథ్ నటించింది. తెలుగులోనూ ఈ సీరియల్ సూపర్ హిట్ అయింది. నల్లగా కనిపించే దీపను  డాక్టర్ బాబు కార్తీక్ ప్రేమించి పెళ్లి చేసుకోవడం.... ఆ తర్వాత అనుమానంతో వారు విడిపోవడం.... దీప ఒంటరిగా బతుకు సాగించటం.....  కుమార్తెలను ప్రేమగా చూస్తూ భర్త ప్రేమ కోసం తపిస్తూ అతనికి చేరువ కావాలని ఆరాట పడుతూ, అన్ని రకాల ఎమోషన్స్  ప్రేమి విశ్వనాథ్ చక్కగా పండించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.
Karthika Deepam Heroine Premi viswanath Real life


దీపా తెలుగు వారిని ఎంతగా ఆకట్టుకుంది అంటే...  ఓ పక్క జబర్దస్త్ వంటి కామెడీ షోలు ఉన్నా కార్తీక దీపం బుల్లితెర రేటింగ్స్ లో టాప్ లో ఉంటుంది. ప్రేమి సహజనటన కార్తీక దీపం సీరియల్ విజయంలో ముఖ్య పాత్ర పోషించింది. ఈ సీరియల్ కోసం మేకప్, కాస్ట్యూమ్స్ కి కనీసం 2 గంటలు పడుతుంది. అయినా ఓపికతో సహజంగా నటించి అటు మళయాళ ప్రేక్షకులనే కాక  ఇటు  తెలుగు ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకుంటోంది ప్రేమి విశ్వనాథ్.  

Premi viswanath Real life Husband

తన నటనతో బుల్లితెర ప్రేక్షకులను మెప్పించిన ప్రేమి విశ్వనాథ్ ప్రముఖ  ఆస్ట్రాలజర్ ను పెళ్లి చేసుకుంది.దేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఆస్ట్రాలజర్స్ లో Dr.T S Vineeth Bhatt ఒకరు. 2017 లోనే అతను ప్రపంచంలోనే  బెస్ట్ ఆస్ట్రాలజర్ గా గుర్తింపు దక్కించుకున్నాడు. ప్రేమి విశ్వనాథ్ ఓ పక్క కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తూనే ప్రేమి తన నటనతో బుల్లితెర ప్రేక్షకులను మెప్పిస్తోంది. తనదైన నటనతో అలరిస్తోన్న ప్రేమి కరతముత్తు సీరియల్ కి గాను బెస్ట్ దిబ్యుట్ ఫిమేల్ ఆర్టిస్టుగా ఏషియా నెట్ అవార్డుతో పాటు, ఇదే సీరియల్ కు ఉత్తమనటిగా J.C Foundation Award  అందుకుంది. అలాగే కార్తీక దీపం సీరియల్ కి గాను నిరుపమ్ తో కలిసి బెస్ట్ జోడిగా, అలాగే ఉత్తమ భార్యగా మా పరివార్ అవార్డ్స్ అందుకుంది. సాధారణంగా సినిమానే కాదు టెలివిజన్ పరిశ్రమ కుడా గ్లామర్ నే చూపిస్తుంది. ఫెయిర్ గా ఉండే హీరోయిన్స్ మాత్రమె ఆన్ స్క్రీన్ మీద కనిపిస్తారు. కాని రియల్ గా ఫెయిర్ గా ఉన్న రీల్ లో  నల్ల గా కనిపిస్తూ అశేష ప్రేక్షకులను అలరిస్తున్న ప్రేమి మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని మనం కుడా కోరుకుందాం ....

Karthika Deepam Heroine Premi viswanath Real life Husband and Family Karthika Deepam Heroine Premi viswanath Real life Husband and Family Reviewed by Kirthi Reddy on February 07, 2020 Rating: 5

No comments

Business

Latest in Sports