సొంత ఇల్లు లేని వారికి నరేంద్ర మోడీ శుభవార్త చెప్పారు ... PM Awas Yojana 2020

సొంత ఇల్లు లేని వారికి నరేంద్ర మోడీ శుభవార్త చెప్పారు ...  PM Awas Yojana 2020 
సొంత ఇల్లు, సొంత భూమి లేనివాళ్ళు అలాగే  అద్దె ఇంట్లో ఎవరైతే ఉంటున్నారో వారి కోసం మోడీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే ఈ పథకం ద్వారా చాలా మంది లబ్ధిపొందారు.
మీరు సొంత ఇల్లు లేక  అద్దె ఇంట్లో ఉంటె వెంటనే అప్లై చేసుకోండి.
 ఈ వీడియోని పూర్తిగా చూస్తే  మీరు  ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకోవచ్చు.


pradhan mantri awas yojana in telugu


 అంటే గ్రామాల్లో ఉండే వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి . పట్టణాల్లో  ఉండే వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలో  ఇప్పుడు తెలుసుకుందాం . అలాగే ఆన్లైన్ లో అప్లై ఎలా చేయాలో కూడా తెలుసుకుందాం .
 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నవ భారత నిర్మాణం కోసం దేశంలో ప్రతీ ఒక్కరికి కూడా సొంత ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు.  దేశంలోని చాలా మంది పేద ప్రజలు దీని వల్ల ఇప్పటికే లాభం పొందారు, కానీ ఇంకా చాలా మందికి ఈ పథకానికి ఎలా అప్లై చేయాలో తెలియక  అప్లై చేసుకోవడం లేదు. అటువంటి వారి కోసం మోడీ ప్రభుత్వం మళ్లీ  అన్ని రాష్ట్రాల ప్రజలకు అప్లై చేసుకొమ్మని  తెలిపింది.  ఇక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల లోని గ్రామాలలో  సొంత ఇల్లులేని ప్రజలు ఇప్పటికే  అప్లై చేసిన వారికి ఇల్లు శాంక్షన్ అయ్యాయి.  ఇంకా మీరు అప్లై చేసుకున్నట్లయితే గ్రామపంచాయతీలో లభ్యమయ్యే అప్లికేషన్ ఫాం ఫిల్ చేసి ఆధార్ కార్డు, రేషన్ కార్డు బ్యాంక్, అకౌంట్ డీటెయిల్స్, క్యాస్ట్ సెర్టిఫీకేట్, ఇన్కమ్ సెర్టిఫీకేట్,  రెండు ఫోటోస్ అటాచ్ చేసి కొత్త ఇంటి కోసం అప్లై చేసుకోవచ్చు.

ఈ పథకం పేరు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం.  ఈ పథకం కింద రాష్ట్రంలోని గ్రామపంచాయితీల్లో  కొత్తగా అప్లై చేసుకోవాలి.  అలాగే ఎవరైతే ఇప్పటి వరకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కి అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఇళ్ల నిర్మాణం జరుగుతుంది. ఇంకా అప్లై చేసుకొని వారు ఎక్కువగా ఉండడం వలన మరో కోటి పన్నెండు లక్షల ఇళ్ళను రిలీజ్ చేశారు. ఇక అదేవిధంగా నగరంలో అద్దె ఇళ్లలో నివసించే వారికి సొంత ఇల్లు లేని వారికి, సొంతప్లేస్ లేనివారికి వాజపేయ్ నగరవసతి యోజన ద్వారా ఇళ్ళను నిర్మించుకోవడానికి స్థలాలను ఇవ్వనున్నారు. మీరు ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు.

ఎలా అప్లై  చేయాలనేది డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాము.  అక్కడ నుండి అప్లై చేసుకోవచ్చు. మొత్తానికి గ్రామ పంచాయితీల్లో  ఇళ్ల కోసం అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా  కొన్ని రోజులలోనే ఇళ్లు మంజూరు కానున్నాయి. దేశంలోని ఎవరికి కూడా సొంత ఇల్లు ఉండాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించింది.
అందుకే ఎవరికైతే సొంత ఇల్లు లేదో వెంటనే గ్రామపంచాయతికి వెళ్లి అప్లై చేసుకోవచ్చు.


సొంత ఇల్లు లేని వారికి నరేంద్ర మోడీ శుభవార్త చెప్పారు ... PM Awas Yojana 2020 సొంత ఇల్లు లేని వారికి నరేంద్ర మోడీ శుభవార్త చెప్పారు ...  PM Awas Yojana 2020 Reviewed by Kirthi Reddy on January 27, 2020 Rating: 5

No comments

Business

Latest in Sports