KTR Khammam Tour
ఖమ్మం జిల్లా కేంద్రంలో 219 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,మున్సిపల్, ఐటి శాఖ మంత్రి కేటీఆర్ గారు,రవాణా మంత్రి పువ్వాడ అజయ్,హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి పాల్గొనడం జరిగింది..
1. రూ. 1.25 కోట్లతో నిర్మించిన ఖానాపురం మినీ ట్యాంక్ బండ్ ప్రారంభోత్సవం
2. రూ. 2.85 కోట్ల రూపాయలతో బల్లెపల్లి అధునాతన వైకుంఠ ధామం ప్రారంభోత్సవం
3. రూ. 18 కోట్ల రూపాయలతో పాండురంగాపురం-కోయచలక క్రాస్ రోడ్డు వరకు వెడల్పు, బిటి రోడ్డు విస్తరణ పనులు, సెంట్రల్ డివైడర్, లైటింగ్ ప్రారంభోత్సవం (కోయచలక సర్కిల్ వద్ద).
4. రూ.5 కోట్ల రూపాయలతో కోయచెలక రోడ్డు వెడల్పు పనులకు శంకుస్థాపన చేశారు.
5. రూ. 8.4 కోట్ల రూపాయలతో రఘునాధపాలెం- చింతగుర్తి వరకు చేపట్టిన బిటి రోడ్డు వెడల్పు ప్రారంభోత్సవం.
6. రూ. 25లక్షలతో నిర్మించిన రఘునాధపాలెం మినీ ట్యాంక్ బండ్ ప్రారంభోత్సవం.
7. రూ. 4.50 కోట్లతో నిర్మించిన NSP Canal Walk way ప్రారంభోత్సవం చేశారు.
8. రూ.70 లక్షలతో నిర్మించిన KMC పార్క్ (పట్టణ ప్రకృతి వనం, 22వ డివిజన్) ప్రారంభోత్సవం చేశారు.
9. రూ.11 లక్షలతో లకారం ట్యాంక్ బండ్ సర్కిల్లో ఏర్పాటు చేసిన దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు గారి విగ్రహం ఆవిష్కరణ చేశారు.
10. రూ.77 కోట్ల రూపాయలతో నిర్మించిన దంసలాపురం ROB, సెంట్రల్ డివైడర్, సెంట్రల్ లైటింగ్ ప్రారంభోత్సవం చేశారు. అక్కడే సర్కిల్లో ప్రో. జయశంకర్ సార్ విగ్రహంను ఆవిష్కరించారు.
11. రూ.3 కోట్ల రూపాయలతో నిర్మించిన పోలీస్ కమిషనరేట్ నూతన భవనం ప్రారంభోత్సవం చేశారు.
12. రూ.70 కోట్లతో సుందరయ్య నగర్ నందు గోళ్లపాడు ఛానల్ ఆధునీకరణ(ఓపెన్ జిమ్, పార్క్) ప్రారంభోత్సవం చేశారు.
11. రూ.27 కోట్లతో ఇల్లందు సర్కిల్లో నిర్మించిన ఐటి హబ్ ను ప్రారంభించారు
KTR Khammam Tour
Reviewed by Amar Reddy
on
December 07, 2020
Rating:
Reviewed by Amar Reddy
on
December 07, 2020
Rating:

No comments