#బాధ_ఎందుకంటే...!! దేశంలోని ఏ రాష్ట్రాల్లో లేని పథకాలు తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశ పెట్టారు...
#బాధ_ఎందుకంటే...!!
దేశంలోని ఏ రాష్ట్రాల్లో లేని పథకాలు తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశ పెట్టారు...ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు...ఇవన్నీ చేసినా కూడా ప్రజలు ఇలాంటి తీర్పు ఇవ్వడం తెలంగాణ ను ప్రేమించే ప్రతి వ్యక్తిని బాధిస్తుంది
ఒక్కటి మాత్రం నిజం ప్రజలు మార్పుని కోరుకోవడం సహజం...కానీ ఆ వచ్చే ప్రభుత్వం మాత్రం #కేసీఆర్ గారిలా పాలన సాగించడం గగనం...పైగా ఇప్పుడున్న పథకాలను వారు ఏవో సాకులతో ఆపుతారు
తెలంగాణ సమాజం ఇకనైనా మేలుకోవాలి...కాంగ్రేస్ పాలన లో మనం ఎంత కోల్పోయామో ఎంత నిరాధరణ కు గురి అయ్యమో జగమెరిగిన సత్యం...ఇక ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ పాలన ను ప్రత్యేక్షంగా చూస్తున్నాం
#మోడీ పాలన లో దేశాభివృద్ధి తిరోగమనం చెందింది...ఆర్థికంగా ఎంతో నష్టపోయింది..అప్పులో కూరుకుపోయింది..కాంగ్రేస్ హయాంలో 65 గా ఉన్న పెట్రోల్ మరియు 45 గా ఉన్న డీజిల్ ధరలు నేడు వంద రూపాయల మార్కు కు చేరువలో ఉన్నవి...ఇక రైతుల పంటలు నేరుగా కార్పొరేట్ కంపెనీల చేతుల్లో పెట్టె బిల్లు పాస్ జేసీ ఇటు రైతులు అటు సామాన్యుల జీవితాల పైన కోలుకోలేని దెబ్బ తీసింది
బీజేపీ వస్తేనే హిందుత్వం ఉంటుందా లేకుంటే ఉండదా...బ్రిటిష్ వారి కంటే ముందు మన దేశంలో మొగలీయులే ఏం చేయలేకపోయారు మన సంస్కృతి ని ఆ తరువాత బ్రిటిష్ వారు కూడా హిందుత్వాన్ని ఏమి చేయలేక చేతులెత్తేశారు...అలాంటిది ఈరోజు బీజేపీ ఒక్కటే హిందుత్వాన్ని కాపాడుతుంది అని నమ్మడం ఒక మూర్ఖత్వం...హిందూత్వం అని చెప్పుకునే బీజేపీ మాతృ సంస్థలు బ్రిటిషు పాలనలో ఆంగ్లేయుల వద్ద ఉండి ఊడిదం చేసింది నిజం కాదా...పైగా వీరు స్వాతంత్ర్య ఉద్యమాల్లో పాల్గొన్న దాఖలాలు లేవు...పై నుండి హిందుత్వం అంటూ ప్రగల్భాలు
ప్రజలు ఇప్పటికైనా బీజేపీ యొక్క కుటిల నీతిని గ్రహిస్తే మేలు...లేకుంటే తప్పదు కొత్త తలనొప్పులు...!!
- రఘువీర్ రాథోడ్
#బాధ_ఎందుకంటే...!! దేశంలోని ఏ రాష్ట్రాల్లో లేని పథకాలు తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశ పెట్టారు...
Reviewed by Spoorthi
on
December 05, 2020
Rating:
No comments