YSR కొత్త పధకం నేరుగా మీ ఖాతాలోకి 67,500 రూ అప్లై చేసుకోకుంటే వెంటనే చేసుకోండి #APCMJagan
ఏపీ సీఎం జగన్ రైతులపై వరాల జల్లు
కురిపించారు. ap cm jagan మాట్లాడుతూ రైతులకు మంచి చేయాలన్న ఆలోచనతో
తాపత్రయంతో 67500/- రైతులకు ఖాతాలో జమచేయనున్నట్లు తెలిపారు
. ఇంతకి ఈ 67500/-రూపాయలను ఏ పథకం ద్వారా రైతుల ఖాతాల్లో
వేయబోతున్నారు? ఎలా వేయబోతున్నారు? అర్హతలు
ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం ...
ఒక
వేళా ఇది వరకే మీరు ఈ పథకానికి అప్లై చేసుకుంటే దాని యొక్క స్టేటస్ ఏంటో
తెలుసుకోవడానికి కింద Description లో లింక్ ఇస్తున్నాను. ఎక్కడ మీ ఆధార్
కార్డ్ నెంబర్ ఎంటర్స్టే చేసి స్టేటస్ ఏంటో తెలుసుకోవచ్చు.
ఈ
పథకం ద్వారా దాదాపు 46 లక్షల మంది లబ్ధి పొందుతారని AP సీఎం జగన్ చెప్పారు.
రైతులు ప్రీమియం
కట్టుకోవాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వమే రైతులకు ఇన్సూరెన్స్ ప్రీమియం
కడుతుందని జగన్ చెప్పారు. ఇన్సూరెన్స్ ప్రీమియం కోసం 2100 కోట్ల
రూపాయలు రైతుల తరపున మేమే చెల్లిస్తామని AP CM జగన్
చెప్పారు. రైతులకు వడ్డీ లేని రుణాలు అనే పథకాన్ని ప్రవేశపెట్టామని సగర్వంగా
చెబుతున్నామని జగన్ అన్నారు. ఈ సంవత్సరం ఖరీఫ్ లో కానీ రబీలో కానీ రుణాలు
తీసుకున్న రైతులకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని ఆ వడ్డీలను పూర్తిగా ప్రభుత్వమే
భరిస్తుందని అన్నారు . అదేవిధంగా రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ఇంకా మంచిది
చెప్పారు. గ్రామ సచివాలయ ప్రక్కనే రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన
తెలిపారు. వ్యవసాయ నిపుణులను రైతులకు అందుబాటులో ఉంచుతామని, అలాగే
రైతు భరోసా కేంద్రాల్లోనే నాణ్యమైన విత్తనాలు ఎరువులు పురుగుల మందులు రైతులకు
అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు jagan తెలిపారు. రైతులకు
ఎలాంటి సందేహాలు ఉన్నా రైతు భరోసా కేంద్రాల్లో పరిష్కారం లభిస్తుందని చెప్పారు. 11158
రైతు భరోసా కేంద్రాలను వ్యాప్తంగా ఏర్పాటు చేయనున్నట్లు jagan
చెప్పారు .
అలాగే
ప్రతి ఏటా 13500/-
రూపాయలు 5 సంవత్సరాల పాటు రెండు విడతలుగా
ఇవ్వనున్నారు. దాదాపు 67500/- రూపాయలు ప్రతి రైతుకు raithu
barosa పథకం ద్వారా ఇవ్వనున్నట్లు చెప్పారు . ఈ పథకం ద్వారా రాష్ట్ర
వ్యాప్తంగా దాదాపు 46 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతారని
సీఎం జగన్ చెప్పారు. రైతు భరోసా పథకానికి అర్హత ఉండి ఎవరైనా అప్లై చేసుకొనట్లయితే
గ్రామ వాలింటర్ ను సంప్రదించి మీరు ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు.
YSR కొత్త పధకం నేరుగా మీ ఖాతాలోకి 67,500 రూ అప్లై చేసుకోకుంటే వెంటనే చేసుకోండి #APCMJagan
Reviewed by Kirthi Reddy
on
January 27, 2020
Rating:
No comments