లంచం ఇవ్వలేదని చెప్పులతో బాదుతూ.. మహిళా అధికారిణి హల్‌చల్!
లంచం ఇవ్వలేదని చెప్పులతో బాదుతూ.. మహిళా అధికారిణి హల్‌చల్!
కంటోన్మెంట్‌కు చెందిన దశరథరామి రెడ్డి అనే వ్యక్తి గత ౩
సంవత్సరాలుగా ఇంటి నిర్మాణ అనుమతుల కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. ఇంటి
నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకుంటే లంచం అడగడమే కాకుండా, అడిగినందుకు
ఓ మహిళా అధికారి చెప్పులతో దాడి చేసింది. ఈ ఘటన సికింద్రాబాద్‌లో చోటు చేసుకుంది. అనుమతి
ఇవ్వాలంటే లంచం ఇవ్వాలని అధికారులు వేధిస్తున్నారని దశరథరామి రెడ్డి ఆరోపిస్తున్నాడు.
చేసేదేం లేక దశరథరామి రెడ్డి కోర్టుకు వెళ్లి ఇంటి నిర్మాణానికి అనుకూలంగా
ఉత్తర్వులు తెచ్చుకున్నాడు. అయినా అధికారుల
నుంచి ఎలాంటి స్పందన లేదని చెప్పాడు . ఇక ఇంటి నిర్మాణం స్టార్ట్ చేసాడు, అది
తెలుసుకున్న అధికారులు మంగళవారం దాన్ని పరిశీలించేందుకు అక్కడికి వచ్చారు.
అనుమతులు లేకుండా ఇంటిని ఎందుకు నిర్మిస్తున్నారని అధికారులు ప్రశ్నించగా, మరి అనుమతులు మంజూరు చేయాల్సిందిగా మరోసారి దశరథరామి రెడ్డి అధికారులను కోరాడు.
ఈ క్రమంలో మహిళా అధికారిణి దశరథరామి రెడ్డిపై చెప్పులతో దాడి చేసింది . పోలీసులకు
ఫిర్యాదు చేయగా, ఆ అధికారిణిని వదిలేసి తనపైనే కేసు నమోదు
చేశారని బాధితుడు చెప్పాడు. తనకు న్యాయం చేయాలని దశరథరామిరెడ్డి కోరాడు.
అయితే, బాధితుణ్ని మహిళా అధికారిణి చెప్పుతో
కొడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘‘లంచం
అడిగింది ఈ మేడమే.. అనుమతి కోసం ఇంకా నువ్వు పదేళ్లు తిరగాలి చెప్పింది. మీరనలేదా
మేడమ్.. దేవుడి మీద ఒట్టేసి చెప్పండి’’ అని అరుస్తూ దశరథరామి
రెడ్డి అక్కడున్న అందరికీ చెప్పాడు. దీనిపై ఆగ్రహించిన ఆ మహిళా అధికారిణి.. చెప్పు
తీసుకొని కొడతా.. నన్నే లంచం అడిగానని అంటావా..హౌ డేర్ యూ’’ అని
ఆవేశంతో ఊగిపోతూ చెప్పులతో బాధితుడి పై దాడి చేసింది.
లంచం ఇవ్వలేదని చెప్పులతో బాదుతూ.. మహిళా అధికారిణి హల్‌చల్!
Reviewed by Kirthi Reddy
on
January 29, 2020
Rating:
Reviewed by Kirthi Reddy
on
January 29, 2020
Rating:

No comments